వైఎస్ జగన్ వెన్నంటి ఉంటాం

కర్నూలు: పార్టీ నుంచి ఎంతమంది వెళ్లినా తాము మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నర్సింగ్ యాదవ్, రాంపుల్లయ్య యాదవ్ లు స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలకోసమే పార్టీని వీడి వెళుతున్నారని అన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లో తాము పార్టీని వీడేది లేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే తామంతా ఉంటామని తేల్చిచెప్పారు.

Back to Top