వైఎస్ జ‌గ‌న్ తోనే మేమంతా..!

యర్రగుంట్ల (కడప):  వైఎస్సార్సీపీ కి మైసూరా రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన తాము వైదొల‌గ‌టం లేద‌ని జ‌మ్మ‌ల‌మ‌డుగు పార్టీ ఇన్ ఛార్జి, మైసూరా రెడ్డి త‌మ్ముడి కుమారుడు సుధీర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జగన్ కి అండగా ఉంటామని ఆయ‌న తెలిపారు. వైఎస్‌ఆర్‌ సీపీకి మైసూరారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం రాత్రి ఆయన సోదరుడు కుమారుడు సుధీర్‌రెడ్డి  విలేకరులతో మాట్లాడారు.తన పెదనాన్న మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సుధీర్ రెడ్డి తెలిపారు. పెదనాన్నతో ఇప్పటికీ నాలుగు సార్లు మాట్లాడానని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సుధీర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ చేసే ప్రజా పోరాటాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా  నాయకత్వం వీడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ మైసూరా రెడ్డి వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని సుధీర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top