ట్యాంకర్లతో నీటి సరఫరా

సింహాద్రిపురం : సింహాద్రిపురం మేజర్‌ గ్రామ పంచాయతీలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గత 15రోజులుగా ట్యాంకర్లతో నీటి సరఫరాను కొనసాగిస్తున్నారు. చెర్లోపల్లె గ్రామానికి వెళ్లే పైపులైన్‌ మరమ్మత్తులకు గురి కావడంతో సింహాద్రిపురానికి తాగునీటి సమస్య జఠిలమైంది. పంచాయతీ వాసులకు తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పార్నపల్లె బృహాత్తర పథకం నుంచి వారం రోజులకుపైగా సింహాద్రిపురానికి సరఫరా లేదు. దీంతో దప్పిక తప్పడంలేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రతిరోజు 14వార్డులలో ఏడు ట్యాంకర్ల ద్వారా నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామస్తులకు కొంత ఉపశమనం కలుగుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ చేయూతతో 7మంది దాతలు ట్యాంకర్ల ఆయా వార్డులలో నీటిని సరఫరా చేస్తున్నారని ఉప సర్పంచ్‌ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

Back to Top