పుష్క‌రాల పేరిట నీటి దోపిడీ

  • రాయలసీమకు అన్యాయం చేస్తున్న బాబు
  • పుష్కరాల పేరుతో ఎడాపెడా నీటిని వదలడంపై ఆగ్రహం
  • రైతులతో కలిసి ఆందోళన చేపట్టాలని నిర్ణయం
  • వైయస్సార్సీపీ నేత రఘురామిరెడ్డి

వైయస్సార్ జిల్లాః  చంద్రబాబు రాయలసీమను విస్మరిస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ర‌ఘురామి రెడ్డి ఫైర్ అయ్యారు. రాయ‌ల‌సీమ‌కు రావ‌ల‌సిన కృష్ణా జ‌లాల‌ను రానివ్వ‌కుండా .... పుష్క‌రాల పేరుతో 70వేల క్యూసెక్కు ల నీటిని నాగార్జునసాగర్ కు వ‌ద‌లడం సరికాదన్నారు. పుష్కరాలకు అంత నీరు అవసరం లేదన్నారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు సాగునీరు విడుద‌ల అంశంపై నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష రౌండ్ టేబుల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు.  శ్రీశైలం ప్రాజెక్టు లో ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ పేరిట 92 టీఎంసీల నీటిని కిందికి వ‌ద‌ల‌డం వ‌ల్ల నీటి లెవెల్స్ ప‌డిపోయి కేసీ కెనాల్‌, తెలుగు గంగ ప్రాజెక్టుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని ఆయ‌న తెలిపారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై అనేకసార్లు మొరపెట్టుకున్నాప్రభుత్వ తీరు దున్నపోతుమీద వానపడినట్లుగా ఉందని తూర్పారబట్టారు. 

2015 సంవ‌త్స‌రంలో  శ్రీశైలం ప్రాజెక్టుకు వ‌చ్చిన నీటి శాత‌మే త‌క్కువ అన్నారు.  గ‌త రెండు సంవ‌త్స‌రాల అనుభ‌వంతో రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం లో లెవెల్స్ మెయిన్‌టెయిన్ చేయాల‌ని డిమాండ్ చేశారు. 874 అడుగుల లెవెల్‌ వ‌చ్చేవ‌ర‌కు నీటిని కిందికి వ‌ద‌ల‌కూడ‌ద‌న్నారు. 875 లెవెల్ వ‌చ్చిన వెంట‌నే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గాలేరు న‌గ‌రి, తెలుగు గంగ  ప్రాజెక్టుల‌కు నీరు వ‌ద‌లాల‌ని తెలిపామ‌న్నారు. దీనిపై ఇప్పటికే తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఛీఫ్ సెక్ర‌ట‌రీ, ఇరిగేష‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీల‌ను క‌లిసి విఙ్ఞ‌ప్తి చేసినట్లు తెలిపారు.  
 
రైతులతో కలిసి ఆందోళన చేపడుతాం
 రాయ‌ల‌సీమ‌కు నీటిని వ‌ద‌ల‌డానికి చంద్రబాబు సుముఖంగా లేకపోవడం బాధాకరమని రాఘురామ‌రెడ్డి అన్నారు. ఆల్మ‌ట్టి, నారాయ‌ణ‌పురి, జూరాల ప్రాజెక్టుల్లో నీటిలెవెల్స్ త‌గినంత వ‌చ్చిన త‌ర్వాతే నీటిని కింద‌కి వ‌దులుతున్నార‌ని, కానీ మ‌న ప్ర‌భుత్వం మాత్రం ఇష్టానుసారం నీరు వ‌దిలేస్తుందని దుయ్యబట్టారు. రాయలసీమకు  జరుగుతున్న అన్యాయంపై రైతుల‌తో క‌ల‌సి ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌ుతామ‌న్నారు. బ్రహ్మంసాగర్ కాలువ తవ్వకాల్లో ప్రభుత్వం మాట తప్పిందని ఫైర్ అయ్యారు.   తెలుగు గంగ‌కు 20 టీఎంసీల నీటిని కూడా ఇవ్వ‌లేని ఈ ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలో అర్ధం కావ‌డం లేద‌న్నారు. 

Back to Top