తూటాలు, లాఠీలతో చేలకు నీళ్లు రావు

రైతుల పొట్టగొట్టిన ఏ ప్రభుత్వమూ నిలబడలేదు
మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీఛార్జ్ అమానుషం
హక్కుల కోసం పోరాడితే అరెస్ట్ లు చేస్తారా
రైతుల ఉసురు తగిలి నాశనమైపోతారు
వైయస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః టీఆర్ఎస్ సర్కార్ రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని  వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుల పొట్టగొడుతున్న కేసీఆర్ కు వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే.....

  • వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న రైతుల భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కోవడం దారుణం. 
  • వాళ్ల హక్కుల్ని కాలరాసేవిధంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి, అరెస్ట్ లు చేయడం ఎంతవరకు సబబు
  • మల్లన్నసాగర్  ప్రాజెక్ట్ రీడిజైన్ పై చర్చే జరగలేదు. 
  • రైతులన్నకు సంబంధించి భూముల విషయంలో గానీ, ఇళ్లు కోల్పోతున్న విషయంలోగానీ అఖిలపక్షం అభిప్రాయం గానీ, ప్రజాభిప్రాయ సేకరణ గానీ చేపట్టారా..?
  • రాత్రికి రాత్రే డిజైన్ లు మార్చేసి కొత్త జీవోలు తీసుకురావడం హేయనీయం.
  • 2013 భూసేకరణ చట్టాన్ని పక్కకుబెట్టి 123వ జీవో తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది. 
  • ఆరు లక్షలు ఇస్తామనడమేంది. ఇళ్లు ఖాళీ చేయాలనడమేంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులు తీసుకొచ్చి ఉళ్లల్లో పెట్టడమేంది.
  • జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తారు. 
  • రాత్రికి రాత్రి కొందరు టీఆర్ఎస్ నేతలు రైతుల దగ్గరకు పోయి ఒత్తిడి పెట్టి వారితో ఒప్పందాలు చేసుకోవడం తగునా. 
  • రైతులకు మీరేం న్యాయం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో వాళ్లను సంతృప్తిపర్చేలా ఎప్పుడైనా మాట్లాడారా..?
  • నిర్వాసితులను క్షోభపెట్టకుండా భూసేకరణ చేయాలని హైకోర్టు చిప్పినా కేసీఆర్, హరీష్ రావులకు పట్టదా.
  • లాఠీలతో రైతుల వెంట బడాల్సిన అవసరం ఏమిటి. టీఆర్ఎస్ దుశ్చర్యను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు
  • మా విధానమే రైతుల పక్షం. రైతుల పొట్టనింపడం. రైతుల కోసం వైయస్సార్ ఎంతో చేశారు. ఆయన ప్రారంభించిన జలయజ్ఞమే నేటికి ఫలితాల్నిస్తోంది. ఇదే విషయాన్ని మీ సాగునీటి రంగ నిపుణులే చెబుతున్నారు. అది కేసీఆర్ తెలుసుకోవాలి.  
  • రైతన్నల కడుపుకొట్టిన ఏ ప్రభుత్వం నిలబడిన దాఖలాలు లేవు.
  • రైతుల ఉసురు తగిలి నాశనమైపోతారు. వాళ్ల హక్కుల గురించి మాట్లాడుతే  లాఠీఛార్జ్ చేస్తారా
  • మల్లన్నసాగర్ ప్రాజెక్ట్  రీడిజైన్ ను సాక్షాత్తు మీ సాగునీటి రంగనిపుణులే ప్రశ్నిస్తున్నారు. అది ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది.
  • ప్రభుత్వానికి  ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అఖిలపక్షంతో చర్చించి రైతన్నల కడుపునింపేలా ముందుకెళ్లాలి.
  • రైతులను బలవంతంగా ఎందుకు వెళ్లగొడుతున్నారు. 
  • టీఆర్ఎస్ పాశవిక చర్యల వల్ల భూమి వదులుకోలేక  బచ్చలి నర్సయ్య అనే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 
  • బంద్ కు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు, రైతులపై లాఠీఛార్జ్ లు, అరెస్ట్ లు ఎందుకు చేస్తున్నారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి.
  • విద్యార్థుల బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలాగేనా కేసీఆర్ మీరు చేసేది. 
  • మెదక్ జిల్లాలో 600 రైతులు ఆత్మహత్య చేసుకుంటే 60 మందికి కూడా డబ్బులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు
  • ప్రతిపక్షం నిలదీస్తే కేసులు పెడుతున్నారు. సరైన విధానంలో ముందుకెళ్లండి
  • బీడు అనే భూమి లేకుండా నీళ్లు తీసుకొస్తే సంతోషిస్తాం. ప్రాజెక్ట్ ల విషయంలో వైయస్సార్సీపీ వెనుకాడే ప్రసక్తే లేదు. కానీ నిర్వాసితులకు 
  • ఆదుకున్నాకే ముందుకెళ్లాలి. 
  • తూటాలు, లాఠీఛార్జ్ లతో నీళ్లు చేలకు రావు. రైతన్న లు సంతోషంగా భూములిచ్చేలా చేసుకోవాలి. 
  • ఆ రోజు  బషీర్ బాగ్ లో రైతులపై తూటాలు పేల్చిన బాబుకు ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. 
  • 2019 ఎన్నికల నాటికి వైయస్సార్సీపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుంది అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 
Back to Top