పుంగనూరులో జగన్‌కు అపూర్వ స్వాగతం

పుంగనూరు (చిత్తూరు జిల్లా) :

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో సమైక్య శంఖారావం యాత్ర చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి చౌడేపల్లెలో బసచేసిన శ్రీ జగన్ సోమవారం ఉదయం అక్కడి నుంచి యాత్ర ప్రారంభించారు.‌ శ్రీ జగన్‌ యాత్ర పొడవునా అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. అరకిలోమీటరరు దూరంలోని జంక్షన్‌కు ఆయన చేరుకునేందుకు రెండు గంటలు పట్టింది. చౌడేపల్లె, కొండమర్రిలలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను శ్రీ వైయస్ జగ‌న్ ఆవిష్కరించారు.

కొండమర్రి మార్గంలో అత్యధిక సంఖ్యలో ముస్లిం మతపెద్దలు శ్రీ జగన్‌ను కలసి సంఘీభావం ప్రకటించారు. వారి కోరిక మేరకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి వారిని ఉద్దేశించి ఉర్దూలో మాట్లాడారు. పార్టీలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కొండమర్రిలో గిరిజనులు శ్రీ జగన్‌కు డప్పులు, నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఠాణా ఇండ్లు, బిల్లేరు క్రాస్, చింతమాకులపల్లె క్రాస్, పుదిపట్ల, బోయకొండ క్రాస్‌ల మీదుగా లద్దిగం చేరుకున్నారు.

లద్దిగంలో కణగాని అంజప్ప కుటుంబాన్ని శ్రీ జగన్ ఓదార్చారు. మార్గమధ్యంలో పాఠశాల విద్యార్థులు, రైతు కూలీలు, ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో రహదారులకు ఇరువైపులా బారులుతీరి స్వాగతం పలికారు. అక్కడి నుంచి చదళ్ల, భగ‌త్‌సింగ్ కాలనీల మీదుగా పుంగనూరు చేరుకున్నారు. పుంగనూరు పాత బస్టాండ్ సర్కి‌ల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు. పుంగనూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో శ్రీ జగన్‌ మంగళవారంనాడు సమైక్య శంఖారావం యాత్ర నిర్వహిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top