కల్లూరు, పామిడిలో షర్మిలకు జన నీరాజనం

అనంతపురం, 5 సెప్టెంబర్ 2013:

సమైక్య శంఖారావం పూరించిన శ్రీమతి షర్మిలకు అనంతపురం ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. సమైక్య శంఖారావం బస్సు యాత్ర నాలుగవ రోజు గురువారం ఉదయం ఆమె కల్లూరు, పామిడిలో బస్సుయాత్ర చేశారు. ఈ రెండు గ్రామాల ప్రజలు శ్రీమతి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. బుధవారం రాత్రి అనంతపురంలో బస చేసిన శ్రీమతి షర్మిల గుత్తి మీదగా డోన్ చేరుకుంటారు. డోన్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.

ఆ తరువాత శ్రీమతి షర్మిల బస్సు యాత్ర కర్నూలు చేరుకుంటుంది. సాయంత్రం ఆరు గంటలకు కర్నూలు బహిరంగ సభలో ఆమె సమైక్య శంఖారావం పూరిస్తారు. మరోవైపు విద్యార్థులపై కేసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతాల విషయంలో అండగా ఉంటామని శ్రీమతి షర్మిల భరోసా ఇవ్వటం పట్ల ఆంధ్రప్రదేశ్ వై‌యస్ఆర్ టీచ‌ర్సు ఫెడరేషన్, ఆప్టా సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

తాజా వీడియోలు

Back to Top