ప్రజల నోట వైఎస్సార్సీపీ గెలుపు మాట

ఓరుగల్లులో జగన్ కు అపూర్వ ఆదరణ
రాజన్న బిడ్డ కోసం కదిలిన ఊరువాడ

వరంగల్ః వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. జననేత వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నాలుగురోజులుగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ...పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరువాడ అంతా రాజన్న బిడ్డకు ఘనస్వాగతం పలుకుతోంది. యువకులు, మహిళలు, వృద్ధులు, రైతులు, కూలీలు అంతా వైఎస్ జగన్ కు మద్దతుగా కదం తొక్కుతున్నారు. తండోపతండాలుగా తరలివచ్చి వైఎస్ జగన్ ను ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి ఆత్మీయంగా నమస్కరిస్తూ..వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరుపున ప్రచారం సాగిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగసభల్లో పాల్గొని ....ప్రజలను మోసగించిన టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీల వైఖరిని ఎండగడుతున్నారు. 

వైఎస్సార్సీపీ గెలుపు బాట..!
చివరిరోజైన నాలుగోరోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ మొత్తం 62 కిలోమీటర్ల పాటు వైఎస్ జగన్ ప్రచారం నిర్వహిస్తారు. హన్మకొండ నుంచి వైఎస్ జగన్ ప్రచారం మొదలుపెట్టారు. హన్మకొండ-నయిూంనగర్-కేయూ క్రాస్ రోడ్-కాజీపేట-మడికొండ-ధర్మసాగర్-ఎల్దుర్తి-పెద్ద పెండ్యాల-చిన్నపెండ్యాల-స్టేషన్ ఘన్ పూర్-కోమళ్ల-షాగల్-రఘునాథపల్లి వరకు వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం స్టేషన్ ఘన్ పూర్లో వైఎస్ జగన్ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. 

రాజన్న బిడ్డకు ఓరుగల్లు ఓటర్ల ఆశీర్వాదం..
వైఎస్ జగన్ ను చూస్తే అచ్చం రాజన్నను చూసినట్లే ఉందని ఓరుగల్లు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తమ బతుకులు బాగుండేవని..మా బాంధవుడు చనిపోయాక ఆతర్వాత ఉన్న ముఖ్యమంత్రులు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు తమను ఆదుకోవడమే లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వైఎస్ జగన్ రాకతో తమలో ఆశలు చిగురించాయని ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు తమకు దక్కాలంటే..రాజన్న ఆశయాలతో రూపొందిన వైఎస్సార్సీపీతోనే సాధ్యమని భావిస్తున్నామన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తేల్చిచెప్పారు. 
Back to Top