ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మనదే

- టీడీపీ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత 
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి స్పంద‌న‌
- సంఘీభావ పాదయాత్రను విజయవంతం చేద్దాం

విజ‌య‌న‌గ‌రం: చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజ‌య‌మ‌ని పార్టీ ఉత్త‌రాంధ్ర జిల్లాల క‌న్వీన‌ర్, ఎమ్మెల్సీ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి పేర్కొన్నారు.  పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు స్వగృహంలో  ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 29వ తేదీ నాటికి వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ రోజున అన్ని ప్రాంతాల్లో చేపడుతున్న సంఘీభావ పాదయాత్రను కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ టీడీపీ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.  తాను పార్టీ మారుతానన్న వస్తున్న వార్తల్లో నిజం లేదని, వైయ‌స్ జ‌గ‌న్ వెంటే ఉంటాన‌ని కొల‌గ‌ట్ల స్ప‌ష్టం చేశారు.  టీడీపీలో చేరే దుస్థితి తనకు పట్టలేదని చెప్పారు. సర్వేలన్నీ వైయ‌స్ఆర్‌సీపీకి  అనుగుణంగా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మనదేనని దీమా వ్యక్తం చేశారు.  


Back to Top