వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఓ చరిత్ర


విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఓ చరిత్ర అని, గతంలో ఏ నాయకుడు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్‌విత్‌ జగనన్న కార్యక్రమంలో లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అనుహ్యమైన స్పందన వస్తుందన్నారు. ఇది మేం చెప్పడం కాదని, జాతీయ మీడియానే చెబుతోందన్నారు. ఆ సర్వే మాకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరిని వైయస్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరిని కలవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు అన్నారు. ప్రజలు తప్పకుండా వైయస్‌ జగన్‌ను గౌరవిస్తారన్నారు. చంద్రబాబు, తన పార్టీ నేతలు రాష్ట్ర ఖజానాను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. బోండా ఉమాను ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు.

ప్రభుత్వ పతనం మొదలైంది:  వెల్లంపల్లి శ్రీనివాస్‌
వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని వైయస్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ పతనం మొదలైందన్నారు.
 
Back to Top