29న వాక్‌ విత్ వైయ‌స్‌ జగన్

 

నెల్లూరు: ‘వాక్‌ విత్ వైయ‌స్ జగన్‌’ కార్యక్రమాన్ని ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. బుధ‌వారం విశాఖ‌లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ..   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగకుండా నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 29న నెల్లూరు జిల్లాలో 1,000 కి.మీ. మైలురాయి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాలని ఆయ‌న పిలుపునిచ్చారు. వెయ్యి కిలోమీట‌ర్లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా పూర్తి అయిన  సంద‌ర్భంగా అన్ని మండ‌లాలు, నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లా కేంద్రాలు, రాష్ట్ర‌వ్యాప్తంగా, ఇత‌ర రాష్ట్రాలు, దేశ‌వ్యాప్తంగా, విదేశాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంఘీభావంగా పాద‌యాత్ర‌లు, ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. నెల్లూరు జిల్లా వెంక‌ట గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఓ స్థూపం ఏర్పాటు చేస్తున్న‌ట్లు విజ‌య‌సాయిరెడ్డి వెల్ల‌డించారు.


Back to Top