వైయస్ ఆర్ సీపీలో చేరిన వక్ఫ్ బోర్డు మాజీ డైరక్టర్

కర్నూలు జిల్లా కల్లూరులో వక్ఫబోర్డు మాజీ డైరక్టర్ సుభాన్
తో సహా దాదాపు 150 మంది వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి
కాటసాని రాంభూపాల్ రెడ్డి వీరందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా
కల్లూరు ఊరికివాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో కాటసాని పార్టీ పతాకాన్ని
ఆవిష్కరించారు. తెలుగుదేశం అరాచక పాలనకు చరమ గీతం పాడటానికి ప్రతి కార్యకర్త పాటుపడాలని
ఆయన పిలుపునిచ్చారు.

Back to Top