వ్యవసాయ వ్యతిరేకి చంద్రబాబు


అనంతపురం: చంద్రబాబు సర్కార్‌ వ్యవసాయ వ్యతిరేక ప్రభుత్వమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరులో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సీడీ మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు వ్యవసాయాన్ని బాగు చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచుతున్నాడన్నారు. ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఇన్సూరెన్స్‌లు ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. అన్నదాతను మోసం చేస్తున్న టీడీపీ సర్కార్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Back to Top