బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం...!

విశాఖపట్నంః విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలను జరగనిచ్చే ప్రసక్తే లేదని  వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అఖిల పక్షం, గిరిజన సంఘాలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా తవ్వకాలు అడ్డుకుంటామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమని..అధికారంలోకి రాగానే ఏవిధంగా అనుమతులిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.   

బాక్సైట్ మైనింగ్ అనుమతుల జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మరో వైఎస్సార్ సీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  గిరిజన పోరాటాలు, హక్కులను కాలరాస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేతగా తవ్వకాలకు వ్యతిరేకంగా గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు..రూ. కోట్లాది దోచుకునేందుకు  అధికారంలోకి రాగానే మాట మార్చారని అమర్నాథ్ విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top