రాజన్న బాటలో నడుస్తున్న పార్టీకే మీఓటు

నిజాయతీ గా వ్యవహరిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ

పరకాల: వరంగల్ జిల్లా లో ఎన్నికల ప్రచారం చేస్తున్న జన నేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు అపూర్వ స్పందన కనిపిస్తోంది. ఎక్కడికక్కడ
పెద్దఎత్తున జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రాజన్నబిడ్డను చూసేందుకు, ఆయన మాటను
వినేందుకు ఉత్సాహంచూపుతున్నారు.

రోజంతా ఊరూరా పర్యటిస్తూ ప్రజల్ని పలకరిస్తూ
జగన్ పర్యటన సాగింది. సాయంత్రం పరకాల లో బహిరంగ సభ నిర్వహించారు. అశేష
ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉద్విగ్నంగా మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే....


రోజు ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి అనేదిఅందరికీ తెలుసు. ఈ రోజు మనస్సాక్షిని
తట్టాలి. ఎన్నికలు జరుగుతున్నాయి అంటే, ప్రజలకు మంచి జరిగే విషయం అయితే ఒక లా
ఉండేది. ఒక మంచి విషయం గురించి ముఖ్యమంత్రి సవాల్ విసిరి ఎంపీల చేత రాజీనామా
చేయించి ఎన్నికలు చేయిస్తే శబాష్ ముఖ్యమంత్రి అనేవాళ్లం. కానీ, అలా జరగలేదు. ఒక ఎంపీ
కి మంత్రిపదవి ఇప్పించేందుకు ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇదే జిల్లా లో ఇద్దరు దళితులు
ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్లను కాదని మరో నాయకుడికి మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి
కేసీయార్ సరదా పడ్డారు. ఈ సరదా ఫలితమే ఈ ఎన్నికలు.

18 నెలల కాలం గడిచిపోయింది. ఈ 18 నెలల పరిపాలన
ఎలా జరిగిందో గుర్తు చేసుకోండి. ఒక్క ఈ జిల్లాలోనే 150 రైతులు ఆత్మహత్యలు
చేసుకొన్నారు. ఇంతమంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారు అని ముఖ్యమంత్రి
కేసీయార్ ని అడగండిః

పత్తి పొలాల్లోకి ఎప్పుడైనా వెళ్లారా అని
అడగండి. పేరుకి మాత్రం రూ.4,100 మద్దతు ధర అంటారు. కానీ, 3,500 కి కూడా కొనే
పరిస్థితి లేదు. ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7,500
పైగా ధర పలికింది. పత్తి కొనుగోళ్లు ఎందుకు చేయించటం లేదని నిలదీయండి

ప్రతీ దళితునికి మూడెకరాలు ఇస్తామన్నారు. అసలు ఎన్ని ఎకరాలు పంచారు అని అడగండి
16 వందల ఎకరాలు కూడా పంచలేదు. దివంగత నేత సీఎంగా ఉన్నప్పుడు 20 లక్షల 60 వేల ఎకరాల
భూములు  పేదలకు పంచారు. కానీ, కేసీయార్
పాలనలో అందరికీ అన్ని కలిపి 16 వందల ఎకరాలు కూడా పంచలేదు. దీనికి జవాబేమిచెబుతారు.

కేసీయార్ ను పేదరికం అన్నది మీకు తెలుసా అని అడగాలి.  పేదవాడు అప్పులపాలు కావడానికి కారణాలు రెండు
ఉంటాయి. పేదవాడు కి ప్రాణాంతక వ్యాధి వస్తే పేదవాడికి దిక్కుతోచని పరిస్థితి
వస్తుంది. 5,6 రూపాయిల వడ్డీ అయినా వెనకంజ వేయరు. ఈ విధంగా అప్పుల పాలవుతారు. దేశంలోనే
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతీ పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో 108 కి ఫోన్
కొడితే చాలు అంబులెన్స్ లు రావాలి. ప్రతీ పేదవాడికి ఎంత ఖర్చయినా వైద్యం జరగాలి, చిరునవ్వుతో
ఇంటికి తీసుకెళ్లాలి అన్న ఉద్దేశ్యంతో దీన్ని అమలు చేశారు.

ఇప్పుడు కేసీయార్ గారిని అడగాలి. ఆరోగ్య శ్రీ పెట్టి 8,9 సంవత్సరాలు అవుతున్నా
ఒక్క కొత్త అంబులెన్స్ లను ఎందుకు కొనలేక పోయారు అని అడగండి. అదే పాత అంబులెన్స్
లు . కనీసంటైరు మార్చటానికి కూడా దిక్కు లేదు. ఆశ వర్కర్లు సమ్మె చేస్తుంటే
పట్టించుకొనే నాథుడు లేడు. ఇప్పుడు పరిపాలన ఇలా ఉంది.

పేదవాడి మరింత అప్పుల పాలు అవటానికి మరో ముఖ్య
కారణం.. పేదల పిల్లల చదువులు భారం అవుతాయి. ప్రతీ పేదవాడి పిల్లల చదువులు అప్పుల
పాలు కాకూడదనే ఉద్దేశంతో పీజు రీఇంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. 2014..15
సంవత్సరానికి గాను ఫీజురీ ఇంబర్సు మెంట్ 2,450 కోట్లు అయితే ఇప్పటికీ 1,530 కోట్ల
బకాయిలు ఉంచేశారు. దీని గురించి పట్టించుకోవటం లేదు.

ఈ సంవత్సరం మొదలై 5 నెలలు అవుతోంది. గత
సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు కట్టడంలేదు. నాలుగో సంవత్సరం పూర్తయి
సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి లో కాలేజీలు లేవు. కేసీయార్ గారిని..మార్కెట్ కు
వెళ్లారా.. మార్కెట్ లో సామానులు కొన్నారా అని అడగండి. కందిపప్పు కొన్నారా అని
అడగాలి. కిలో రూ. 230 పెట్టాల్సి వస్తోంద. గత ఏడాది రూ. 90 మాత్రమే. మినపప్పు 170
నుంచి 200 మాత్రమే. గతంలో 80 రూపాయిలు.

రేట్లు భగ్గుమంటూ ఉంటే ఇదేనా మీ పరిపాలన అని నిలదీయండి. ఒక వైపు రైతులకు
గిట్టుబాటు ధర లభించటం లేదు. మరో వైపు ధరలు చూస్తే మాత్రం షాక్ కొట్టేలా ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో కేసీయార్ కు ఓటు వేస్తే మన పరిపాలన భాగుంది అనుకొని మనల్ని
పట్టించుకోకుండా వదిలేస్తారు.

హైదరాబాద్ లో రెండు గదుల ఇళ్లకు ప్రారంభోత్సవం చేశారు. కేవలం 394 ఇళ్లకు
ప్రారంభోత్సవం చేశారు. మీరు 18 నెలలు అయిపోయింది. ఎన్ని కొత్త ఇళ్లు కట్టించారు.
రాష్ట్రం మొత్తం మీద ఆయన కట్టించింది 394 ఇళ్లు.  దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ఒక్క
మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టి చూపిస్తే, 18 నెలల్లో 394 ఇళ్లు కట్టించి
గొప్పలు చెబుతున్నారు.ఇదీ కేసీయార్ సాగిస్తున్న పాలన.

ఇప్పుడు మీరు కేసీయార్  కు ఓటేసి గెలిపిస్తే,
ఆయన ఇదే పొరపాటు పరిపాలన ను కొనసాగిస్తారు. అందుకని ఓటేయకుండా ఆపితే,
సరిదిద్దుకొనే అవకాశం కలుగుతుంది.

కాంగ్రెస్ పార్టీది పనికి మాలిన పార్టీ. అవసరం
అయితే కాంగ్రెస్ పార్టీకి దండలువేస్తారు. అవసరం తీరితే బండలు వేస్తారు. కాంగ్రెస్
పార్టీ ని బతికించేందుకు జీవితాంతం కష్టపడ్డారు. కానీ, ఆయన కుటుంబంపై కాంగ్రెస్
పార్టీ విశ్వాసం చూపించలేదు. వైఎస్సార్ కొడుకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు కాబట్టి
ఆయన కుటుంబసభ్యుల్ని జైలుకి పంపించేందుకు కూడా వెనుకాడలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ
బాగోతం...

టీడీపీ పరిపాలన మొత్తం మోసం, దగా, అబద్దాలు అనే
మూడింటి చుట్టూ తిరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఇలా ఉంది. ఆ పార్టీ
మద్దతు ఇస్తున్న బీజేపీ గురించి చూడండి.  18 నెలలు అయింది బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది.
ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడిగితే సమాధానం దొరకదు.

అందుచేత నిజాయితీ ఉన్న పార్టీ, ఓట్లు అడిగే ధైర్యం ఉన్న పార్టీ ఒక్క
వైఎస్సార్సీపీ మాత్రమే.

ప్రతీ ఇంటికి , ప్రతీ మనిషికి, ప్రతీ తాలూకాకు, ప్రతీ జిల్లాకు మంచి చేసిన ఘనత
వైఎస్సార్ గారికి దక్కుతుంది.  దివంగత
వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్సార్సీపీ కి ఓట్లేయమని కోరుతున్నా.

మన దగ్గర కు వచ్చి అడుగుతున్న మన పార్టీ అభ్యర్థి నల్లా సూర్య ప్రకాశ్. ఆయన
గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి సూర్య ప్రకాశ్ ను గెలిపించమని
అడుగుతున్నా.

’’ అని వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు. 

Back to Top