క‌ష్ట‌ప‌డుతూ..ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకుంటూ..చ‌లికాలం వ‌ణికించినా..ఎండ‌కాలం మండినా..వాన‌ల్లో త‌డుస్తున్నా..త‌డ‌బ‌డ‌ని అడుగులు ముందుకే సాగుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు ధైర్యానిస్తూ..నేనున్నానంటూ భ‌రోసానిస్తూ..రేప‌టి రోజుల‌పై ఆశ‌లు రేకెత్తిస్తున్న  ప్ర‌జా సంక‌ల్ప యాత్రికుడు వైయ‌స్ జ‌గ‌న్‌. పాద‌యాత్రల చ‌రిత్ర‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌రిత‌పించే నాయ‌కుడు ఎలా ఉండాలో ఆలోచిస్తున్నారు.  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 200వ రోజులు పూర్తి అయిన సంద‌ర్భంగా ఇటీవ‌ల జాతీయ పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ప్రతినిధి వైయ‌స్ జ‌గ‌న్‌ను ఇంటర్వ్యూ చేశారు.  ఆ స‌మ‌యంలో వైయ‌స్‌ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా ఆ జర్నలిస్ట్ అవాక్కయ్యాడు. కాళ్ళకు బొబ్బలొచ్చి చీము కారే దశలో ఉన్నాయి. ఎంతో ఇన్ఫెక్షన్ కి గురయినా కానీ ..ఇంత నొప్పితో ఎలా నడుస్తున్నారని ఆ ప్రతినిధి ప్రశ్న వేసాడు. దాంతో జగన్ చిరునవ్వు నవ్వుతూ కాళ్ళకు రోజు ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంటుందని, ఎంత నొప్పి ఉన్నా పాదయాత్రలో  ప్రజలు ఎదురొచ్చి  పలకరించగానే ఆ నొప్పి మటుమాయం అవుతుందని జగన్ చాల తేలిగ్గా చెప్పటంతో  ఆశ్చర్యపోవటం ఆ విలేక‌రి వంతయింది. మొత్తానికి ఆ ఫోటోలో జగన్ కాళ్ళకు బొబ్బలతో ఇన్ఫెక్షన్ వచ్చినట్లు చాల స్పష్టంగా కనబడుతుంది. ఈ ఫోటో ని చూసిన కొందరు జగన్ చాల మొండిమనిషని,  ఏదైనా అనుకుంటే చేసి తీరతాడని అందుకే పాదయాత్ర చేయటమే లక్ష్యంగా ఉన్న జగన్.. కాళ్లకు బొబ్బలతో  తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినా , ఆ నొప్పి ని బేఖాతరు చేస్తూ పాదయాత్ర చేయటానికే మొగ్గు చూపుతున్నాడని కొందరు సన్నిహితులు వాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ నాయకులలో కూడా ప్రజల్లో ఉండటం కోసం,  ఇంతగా అంకితభావం చూపుతారా? అని ప్ర‌జ‌లు స్పందిస్తున్నారు.


Back to Top