'ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి'చిత్తూరు: గ్రామస్థాయిలో మహిళాసంఘాలతో పని చేస్తున్న తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని ఐకేపీ వీవోఏలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం పునావాండ్లపల్లె గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్‌ను వీవోఏలు క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.  ప్రభుత్వం ఐకేపీలో గ్రామస్థాయిలో చిన్నతరగతి ఉద్యోగు లను నియమించుకొని మాతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, శ్రమకు తగిన ఫలితం వారికి ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలీచాలని వేతనాలు ఇవ్వడంతో, ఐదారు నెలలకు ఒకసారి ఇవ్వడంతో కుటుంబ భారం అధికమవుతుందని, ఇందుకోసం ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచేలా ఒత్తిడి చేయాల‌ని కోరారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఆగితే మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, వీవోఏల‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీపై ఆ సంఘం నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.    
Back to Top