వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై కొన‌సాగుతున్న దాడులు

 విజయనగరం: డెంకాడ మండలం మోదవలసలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మోదవలస గ్రామంలో జన్మభూమి సభ కోసం అర్జీలు రాస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై  దాడి చేశారు. ఈ క్రమంలో సురేష్, కాంతం అనే ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా వీరికి సహాయంగా ఆటోలో వస్తున్న వారిపై మార్గమధ్యలో మరో సారి టీడీపీ వర్గీయులు దాడికి దిగారు.
దీంతో మరికొందరు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి రక్షణగా ఉండి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు గ్రామంలో సైతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  అలాగే అనంత‌పురం జిల్లా హిందుపూర్‌లో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్ ర‌జినీపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డారు.
Back to Top