యువభేరి సక్సెస్ ... పచ్చనేతల గుండెలు గుభేల్..!

విశాఖపట్నంః విద్యార్థి యువభేరి విజయవంతమైంది. యువభేరిని అడ్డుకునేందుకు
ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సదస్సుకు విద్యార్థులు పెద్ద
ఎత్తున  తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో కళావాణి ఆడిటోరియం
పోటెత్తింది. యువభేరిలో ప్రత్యేకహోదాపై ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ
అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్జించారు. పచ్చనేతల గుండెల్లో
వణుకుపుట్టేలా  ప్రభుత్వ  వైఖరిని తూర్పారబట్టారు.  ప్రత్యేకహోదాపై
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విద్యార్థులు,యువతకు దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు సర్కార్ విద్యార్థులను రానీయకుండా కట్టడి చేసేందుకు
ప్రయత్నించినా..బేఖాతరు చేయకుండా వచ్చినందుకు ప్రతిచెల్లె,సోదరునికి
కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేకహోదాపై ఆయన ఏమన్నారంటే...!
  • రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా యూపీఏ, ప్రతిపక్షాలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు
  • ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు విస్మరించారు
  • కాంగ్రెస్,చంద్రబాబు కుమ్మక్కై నాపై అన్యాయంగా కేసులు పెట్టారు
  • 70 శాతం పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూనే ఉండడంతో...ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు చూడాల్సిన పరిస్థితి.
  • ప్రత్యేకహోదా వస్తే రూ.లక్షల కోట్లు పెట్టుబడులు,ఉద్యోగాలు వస్తాయి..ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది
  • ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనైపోయిందన్నట్లు పాలకులు ప్రవర్తిస్తున్నారు
  • పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా..బొగ్గు నుంచి మట్టివరకు అంతటా అవినీతే
  • రాష్ట్రంలో కమీషన్ల రూపంలో వచ్చిన లంచాలతో చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వెదజల్లారు
  • కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం వద్ద సాగిలపడి హోదాను తాకట్టుపెట్టారు
  • ఎన్నికలప్పుడు ఎక్కడచూసినా రుణాలు మాఫీ కావాలన్నా, జాబులు రావాలన్నా బాబు రావాలని వినిపించేది
  • బాబు వచ్చాక కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు పోగొడుతున్నారు
  • చంద్రబాబు ఇచ్చిన డబ్బులు వడ్డీలకు కూడా సరిపోక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి
  • ఉద్యోగాలు ఇవ్వరు...ఉద్యోగాలిచ్చే హోదా కోసం పోరాడరు
  • అబద్ధాలు, మాయమాటలతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు
  • రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండానే వరల్డ్ ర్యాంక్ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నాడు
  • చంద్రబాబు సీఎం కావడం మన ఖర్మ...అసలు మనిషేనా అనిపిస్తుంది
  • యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీచేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలకోసం పాకులాడుతున్నారు
  • రైతుల భూములను ప్రైవేటుకంపెనీలకు కట్టబెట్టి చంద్రబాబు జేబు నింపుకుంటున్నారు.
  • నాయకుడు అంటే మననాయకుడు అని చెప్పుకునేలా ఉండాలి కానీ కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడతావా..!
  • ఒరిస్సా, తమిళనాడు ఒప్పుకోవడం లేదని ఆర్థికసంఘం ఒప్పుకోవడం లేదని అబద్ధాలు ఆడుతున్నారు.
  • హోదా కేబినెట్ నిర్ణయం ప్రధాని తలచుకుంటే వస్తుంది.

ప్రత్యేక హోదా ఖచ్చితంగా సంజీవనే..

ఆంధ్రప్రదేశ్ కు
ప్రత్యేక హోదా ఖచ్చితంగా సంజీవనే అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. హోదాతోనే
రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే మంగళగిరిలో రెండ్రోజుల దీక్ష చేశామని, ఢిల్లీలో ధర్నా నిర్వహించామని , రాష్ట్ర బంద్ చేపట్టామని , అసెంబ్లీలో కూడా రాష్ట్ర
ప్రభుత్వాన్ని నిలదీశామని జగన్ అన్నారు.  ఈ నెల 25 లోపు ప్రత్యేక హోదాపై
ప్రకటన రాకపోతే 26 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని వైఎస్ జగన్
ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ప్రత్యేక హోదా జగన్  ఒక్కడి వల్ల రాదని,
మీరందరూ కలిసి వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమని, అందరం కలిసి కట్టుగా
ప్రత్యేక హోదా సాధించుకుందామని విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులకు వైఎస్
జగన్ పిలుపునిచ్చారు.


తాజా వీడియోలు

Back to Top