వైయ‌స్ జ‌గ‌న్‌ని క‌లిసిన విశాఖ నేత‌లు

భాకరాపేట : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ జిల్లా చిన్నగొట్టిగల్లు మండల పార్టీ నాయకులు గురువారం అమరావతిలో కలిశారు. రాయలసీమ తూర్పు పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వెళ్లిన నాయకులు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వైయ‌స్ జగన్‌ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి సహదేవరెడ్డి, నాయకులు యండపల్లి నారాయణరెడ్డి, కె.భాస్కర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top