ప్రతిపక్షం గొంతు నొక్కడం అప్రజాస్వామికం

ఏపీ అసెంబ్లీః ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కడం అప్రజాస్వామికమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అనేక బిల్లులు, డిమాండ్స్ విషయంలో చర్చకు రాకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని అన్నారు.  అధికార పార్టీ నేతలు తమను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, దీనిపై చూపిన సమయంలో 50శాతం మాకు మైక్ ఇచ్చినా కూడ రాష్ట్ర సమస్యలు చర్చించబడి న్యాయం జరిగేదని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.  ప్రతీ దాంట్లో పీపీఏ పద్ధతులని చెప్పి వ్యవసాయం, విద్య, వైద్యం మొత్తం కార్పొరేట్ శక్తులకు వదిలేసి ప్రభుత్వం వైదొలగడం దారుణమన్నారు. యూనివర్సిటీలో అధ్యాపకులు లేకుండా కుప్పకూలిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించేందుకు బాబు సర్కార్ ప్రభుత్వ యూనివర్సిటీలను దెబ్బతీస్తోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ శక్తులు చేస్తున్న మోసాల వల్ల విద్యార్థులు బాధితులుగా మారారని,  వాటి గురించి సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. శాసనసభలో న్యాయం జరగకపోయినా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడుతామన్నారు. సభలో ప్రతిపక్షం గొంతు నొక్కే ధోరణిని ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు.

Back to Top