ఏఎస్‌ఐ మృతికిఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సంతాపం

అనంత‌పురం: విడపనకల్లు మండలం పాల్తూరు పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్‌ తాటిచెర్లఅమానుల్లా(59) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అమానుల్లా మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండకు చేరుకోని మృతుదేహం వద్ద నివాళులు ఆర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అమానుల్లా విధుల పట్ల అంకింత భావంతో పనిచేసేవాడని, గతంలో తనకు గన్‌మెన్‌గా కుడా పనిచేశాడని ఎమ్మెల్యే ఎఎస్‌ఐతో తనకున్న అనుభంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. సంతాపం తెలిపిన వారిలో సీఐ సూర్యనారాయణ, పాల్లూరు ఎస్‌ఐ ఖాన్, ఎస్‌ఐలు రత్నం, నగేష్, జనార్థన్‌నాయుడులు, ఉన్నారు.

Back to Top