నాటకాలు కట్టిబెట్టి నీరు ఇవ్వండి..!

అనంతపురం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నధుల అనుసంధానం పేరుతో  చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని పైరయ్యారు. అనంతపురం జిల్లాలోని హంద్రీ-నీవా కాల్వ పనులను విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మొదటి దశ పనులు పూర్తైనా ఆయకట్టుకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ఈసందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.
Back to Top