చిల్లర రాజకీయాలు మానుకో..!

అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని అనంతపురం జిల్లాకు చెందిన వైఎఎస్సార్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. వారంరోజుల ముందే బెళుగుప్పలో ధర్నాకు అనుమతి అడిగినా ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
మరో ఎమ్మెల్యే చాంద్ బాషా మాట్లాడుతూ ....చిల్లర రాజకీయాలు మానుకోవాలని పయ్యావుల కేశవ్ కు హితవు పలికారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి  వైయస్.రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారందరినీ చంపుతారా అని ప్రశ్నించారు. 
Back to Top