బాబు బరితెగింపు రాజకీయాలు

అనంతపురంః ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ చంద్రబాబు బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. 
పార్టీ ఫిరాయింపులను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని...చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో ప్రలోభపెట్టడం...అప్రజాస్వామికం, అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

పోరాడే తత్వంలేని వారే బాబు ప్రలోభాలకు తలొగ్గి అవకాశవాదులుగా మారుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ శాసనసభ్యులకు ఒక్క పని కూడా జరగకుండా చేస్తూ....చంద్రబాబు బరితెగించి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహించారు.  ఇది అత్యంత అమానుషమని అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top