మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన వైయస్సార్‌సీపీ నాయకుడు దేవేంద్ర వదిన అనసూయమ్మను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మృతురాలు అనసూయమ్మ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని , భర్తను వారు ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని చెప్పారు. నివాళులు అర్పించిన వారిలో వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top