సముద్రుడు కుటుంబానికి విశ్వరూప్‌ పరామర్శ

చినగాడవిల్లి(ఉప్పలగుప్తం):  అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముడుదుడ్డి సముద్రుడు కుటుంబాన్ని వైయస్‌ఆర్‌ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ్గ కో ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌ పరామర్శించారు. సముద్రుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సముద్రుడు కుటుంబానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.  విశ్వరూప్‌ వెంట పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు గుద్దటి నాగరాజు, నాయకులు నిమ్మకాలయల కాశి, పెయ్యల కొండ, సాకా మీరాసాహెబ్, తాళ్ళ రెడ్డి, బద్రి చిన్న తదితరులు ఉన్నారు.

Back to Top