విశ్వకర్మ భగవన్‌ జయంతి కార్యక్రమంవిశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం పాదయాత్రకు ముందు విరాట్‌ విశ్వకర్మ భగవాన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూలమాల వేశారు. అనంతపురం, తాడిపత్రిలోని ప్రభోధానంద స్వామి ఆశ్రమ భక్తులు పాదయాత్రలో వైయస్‌జగన్‌ను కలిశారు. తమపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారని జననేతకు ఫిర్యాదు చేశారు. ఆశ్రమ బాధితులకు అండగా ఉంటానని ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు. 
 
Back to Top