విశ్వ‌బ్రాహ్మ‌ణ సంఘం క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

చిత్తూరు:  విశ్వ బ్రాహ్మ‌ణ సంఘం 2018వ సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆ సంఘం నాయ‌కులు శ‌నివారం చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారు ఎదుర్కొంటున్న స‌మస్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష నేత దృష్టికి తీసుకెళ్లారు.  రాష్ట్రంలో 1,50,000 మంది విశ్వ‌బ్రాహ్మ‌ణులు ఉన్నారని, త‌మ‌కు రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌ని తెలిపారు. త‌మ సామాజిక వ‌ర్గానికి ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీ సీటు కేటాయించి చ‌ట్ట‌స‌భ‌లో స్థానం క‌ల్పించాల‌ని కోరారు. అలాగే విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి,  బడ్జెట్లో రూ .500 కోట్లు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వీరి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి..మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక మేలు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో విశ్వ బ్రాహ్మ‌ణులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 
Back to Top