విషమించిన వైఎస్ జగన్ ఆరోగ్యం..!

గుంటూరుః  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇవాళ  ఉదయం రెండుసార్లు డాక్టర్లు వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.  కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, 3+ అంటే మరింత విషమం అని వైద్యులు చెబుతున్నారు. దీంతో, దీక్షా ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గంటగంటకు వైఎస్ జగన్ ఆరోగ్యం ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తుండడంతో కుటుంబసభ్యులు, పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా  తెలుగుప్రజానీకమంతా ఆందోళన చెందుతున్నారు.

శరీరంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీక్ష విరమించాలని పార్టీ నేతలు కోరుతున్నా వైఎస్ జగన్ అందుకు ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప దీక్ష విరమించేది లేదంటున్నారు.

గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఈఉదయం వైఎస్ జగన్ హెల్త్ కండీషన్ కు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బీపీ 130/80 ఎంఎంహెచ్ జీ, పల్స్ 68, బరువు 72.9 కేజీలు, షుగర్ 61, యూరిన్ కీటోన్స్ 3+, ఎఫ్.బి.ఎస్ 61, బ్లడ్ యూరియా 26, ఎస్. క్రియాటిన్ 1.0, ఎస్. బైలురూబిన్0.6, ఎస్జీవోటీ 44, ఎస్జీపీటీ 30, ఎఎల్ కేపీ 75, క్లోరైడ్ 106, బైకార్బోనేట్ 13  అని గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ వివరించారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు  సీనియర్ వైద్యుల బృందం  గుంటూరు నల్లపాడు రోడ్డులోని దీక్షాస్థలికి చేరుకుంటుంది. 


తాజా ఫోటోలు

Back to Top