టీడీపీ భూతువంతమైన పార్టీ

మహాధర్నా స్పందనతో టీడీపీ నేతల వెన్నులో వణుకు
విజయసాయిరెడ్డి గురించి మాట్లాడే అర్హత బండారుకు లేదు
ఆయన లాంటి విద్యావంతుడు మీ పార్టీలో ఒక్కరైనా ఉన్నారా..?
టీడీపీ నేతల చదువులంతా బీకాంలో ఫిజిక్స్‌ 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నీతివంతమైన పార్టీ అని, తెలుగుదేశం భూతువంతమైన పార్టీ అని వైయస్‌ఆర్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. భూకుంభకోణాలకు పాల్పడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు విశాఖ ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడ్డారు. విశాఖ ప్రజలకు, ప్రభుత్వ, రైతు భూములకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సేవ్‌ విశాఖ పేరుతో మహాధర్నా నిర్వహించారన్నారు. ధర్నాకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిందన్నారు. టీడీపీ భూస్కాంలపై వైయస్‌ఆర్‌ సీపీ ఆధారాలతో సహా బయటపెడితే.. అవి తట్టుకోలేని పరిస్థితుల్లోకి టీడీపీ నేతలు దిగజారారన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు మాటలను బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలను ఏ విధంగా క్రమశిక్షణలో ఉంచుతున్నారో ప్రజలందరికీ అర్థం అవుతుందన్నారు. బండారు మాటలను వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌కు వివరించామని చెప్పారు. 

నోరు అదుపులో పెట్టుకో బండారు
బండారు సత్యనారాయణ మూర్తికి వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అమర్‌ ధ్వజమెత్తారు. విజయసాయిరెడ్డి చదవుకున్న డిగ్రీ పట్టాలు చదవడానికే బండారుకు ఒక పూట పడుతుందన్నారు. సాయిరెడ్డి లాంటి విద్యావంతుడు మీ పార్టీలో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. టీడీపీలోని నాయకులంతా సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ నాయకులేనని ఎద్దేవా చేశారు. మీ నాయకులు బీకాంలో ఫిజిక్స్‌ చదువుతారు.. 18 సంవత్సరాలకే మీరు డిగ్రీ పట్టాలు పొందుతారు. ఇదేనా మీ చదువు అని నిలదీశారు. బండారు సత్యనారాయణ మూర్తి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. 
Back to Top