ఈ సారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇస్తాంఇన్నాళ్లు పాలించిన నాయకుల వల్ల ఎలాంటి మేలు జరగలేదు
అభివృద్ధి అంటే ఏంటో వైయస్‌ఆర్‌ చూపించారు
నాయకుడు ఎలా ఉండాలో జననేతను చూస్తున్నాం

విశాఖపట్నం: ఇన్నాళ్లు పాలించిన నాయకుల వల్ల ఎలాంటి మేలు జరగలేదు. ‘వైయస్‌ జగన్‌కు ఒకసారి అవకాశం ఇద్దాం’ అని రాష్ట్ర ప్రజానికం మొత్తం భావిస్తుందని విశాఖ ప్రాంత ప్రజలు అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హాయంలోనే చూశామని, తరువాత వచ్చిన వారంతా జేబులు నింపుకోవడం.. గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుందన్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కలిశారు. 

ఈ మేరకు వారి సమస్యలపై ఏకరువు పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎండా, వాన, దూరం లెక్క చేయకుండా మహిళలు, పిల్లలు, యువత అంతా వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారన్నారు. మనకోసం పాదయాత్ర చేస్తున్న నాయకుడికి ఒక్కసారి అవకాశం ఇద్దామని వైయస్‌ జగన్‌ అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. దారి పొడువునా.. జై జగన్‌.. కాబోయే సీఎం.. సీఎం జగన్‌ అంటూ నినాదాలు చూస్తూ యువత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. జననేతను ముఖ్యమంత్రిని చేసుకోవాలని యువతలో బలంగా నాటుకుపోయిందన్నారు.
 
ప్రజల కష్టాలు వింటూ.. వారి బాధలను తనవిగా భావిస్తూ వైయస్‌ జగన్‌ అందరినీ అక్కున చేర్చుకుంటున్నారన్నారు. ప్రజల్లో మమేకమవుతూ ఎవరూ భయపడొద్దు అని భరోసా ఇస్తూ ముందుకుసాగుతున్నారన్నారు. రాజన్న పాలన రావాలంటూ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు.  
Back to Top