విశాఖలో పోలీసుల ఓవరాక్షన్‌


విశాఖ: పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు. విశాఖలో శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను బలవంతంగా అడ్డుకొని పోలీసు స్టేషన్‌ తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.  టీడీపీ ధర్మపోరాటంపై వైయస్‌ఆర్‌సీపీ నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ధర్మా పోరాట సభ ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేసేందుకు ర్యాలీగా వెళ్తనున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అక్రమ అరెస్టులను ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణచూసి టీడీపీలో వణుకు మొదలైందన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 
 
Back to Top