విప్లవ సూర్యుడు పుస్తకావిష్కరణ

యలహంక : ప్రవాసాంధ్రుడు తక్కెడశీల జానీ  రాసిన ‘విప్లవ సూర్యుడు’  రెండో కవితల పుస్తకాన్ని కడప వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి ఆవిష్కరించారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల పట్టణంలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో జానీ తన కుటుంబ సభ్యులతో కలిసి అవినాష్‌ రెడ్డిని కలిశారు. కవితల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి రచయిత జానీని అభినందించారు. పులివెందుల పట్టణానికి చెందిన జానీ బెంగళూరులోని కోరమంగళలో ప్రతి లిపి వెబ్‌సైట్‌లో తెలుగు విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తెలుగు కవితలపై చిన్నప్పటినుంచి మక్కువ పెంచుకుని ఎన్నో కవితలు రాశారు. కార్యక్రమంలో జానీ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

Back to Top