అందరికీ విప్ జారీ చేశాం

హైదరాబాద్ః అందరికీ నిన్ననే విప్ జారీ చేయడం జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి విలేకరులకు తెలిపారు. ప్రతి ఒక్కరికీ మెసేజ్ లు, టెలిగ్రాఫ్ లు, ఈ మెయిల్ ద్వారా  పంపించామని  చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని ఎమ్మెల్యేలను కోరామన్నారు.  చర్చకు ఎమ్మెల్యేలందరూ హాజరవుతారని అమర్నాథ్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ప్రతి సభ్యుడు అవిశ్వాసాన్ని ఆచరణలో తీసుకోవాలన్నారు. 

విప్ జారీకి అనుకూలంగా సభ్యులందరూ అందుబాటులో ఉండాలని చెప్పామన్నారు. విప్ ధిక్కరించిన వారిపై పార్టీ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. 

Back to Top