వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు

రేగిడి (శ్రీ‌కాకుళం): శ్రీ‌కాకుళం జిల్లా రేగిడి మండ‌లంలోని బూరాడ‌,  చిన్నశిర్లాం, బుడితిపేట తదితర గ్రామాల్లో నెలకొల్పిన గ‌ణ‌నాథుల‌కు బుధ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టంకాల అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, జిల్లా కార్యదర్శి రెడ్డి నర్సింగరావులు మాట్లాడుతూ ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకున్న‌ట్లు చెప్పారు. బుడితిపేటలో గ్రామస్తులంతా గణపతి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పలు చోట్ల అన్నసంతర్పణలు కూడా జరిపారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్దలతో గణనాధుడిని నిమజ్జనం చేశారు.

Back to Top