వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు

దేవరాపల్లి (విశాఖ‌): భూతాపం నియంత్రణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా దేవరాపల్లిలో నెలకొల్పిన వెయ్యి చేతుల వినాయకుని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ  మండల నాయుకులు సోమవారం దర్శించుకున్నారు. రాజరాజేశ్వరీ మోటార్స్, మెడ్‌ప్లస్‌ ప్రాంచైజీల ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మట్టితో ఏర్పాటు చేసిన వెయ్యి చేతుల గణనాధునికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజులు నిర్వహించారు. భారీ వినాయుకునితో పాటు సుందరంగా తీర్చిదిద్దిన వినాయక మండపాన్ని తిలకించారు. వినాయుకుని దర్శించుకున్నవారిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రి సత్యం, యువజన విభాగం అధ్యక్షుడు బూరె బాబురావు, ప్రధాన కార్యదర్శి గూడెపు రాము, యువజన విభాగం నాయుకుడు గొర్లి గోవింద, దేవరాపల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top