భోగాపురంలో భూముల సర్వేపై ప్రజాగ్రహం..!

భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం పెదకవులవాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం భూములను సర్వే చేయడానికి వచ్చిన అధికారులను స్థానికి ప్రజలు అడ్డుకున్నారు. భూ సేకరణకు సంబంధించిన విషయంపై కోర్టులో స్టే ఉండగా సర్వే ఎలా చేస్తారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇటీవలే ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భోగాపురంలో పర్యటించి రైతులకు అండగా నిలిచారు. ఎయిర్ పోర్టు నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూదోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతుల ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top