గ్రామ‌స‌భ‌లు ముఖ్యం..ఎమ్మెల్యే కాకాణి

పొదలకూరు: జన్మభూమి కమిటీలతో సంబం ధం లేకుండా గ్రామసభలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులకు సూచించారు.కొత్త నిబంధలన ప్రకారం గృహనిర్మాణశాఖ అధికారులు గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయా ల్సి ఉందన్నారు. నిబంధనలు పాటించకుంటే అధికారులు ఇబ్బందు లు పడాల్సి వస్తుందన్నారు. 
నీరు-చెట్టు, ఉపాధిహామీ పనులపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు  ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన మండలాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం కింద చేసిన పనులకే అంచనాలు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. 

Back to Top