దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాతూర్పుగోదావరి: ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని మరిచిందని ఓ దివ్యాంగుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 211వ రోజు కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో మూలపల్లి వద్ద వైయస్‌ జగన్‌ను ఒక దివ్యాంగుడు కలిశారు. పెన్షన్‌ వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, తనకు ఇల్లు కూడా లేదని వాపోయాడు. ఇంటి కోసం దరఖాస్తులు చేసుకుంటే టీడీపీ నేతలు దరఖాస్తును చింపి చెత్తకుప్పలో వేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని, అధైర్యపడొద్దని వైయస్‌ జగన్‌ ఆ దివ్యాంగుడికి హామీ ఇచ్చారు. 
 
Back to Top