సోమయాజులుకు వైయస్‌ విజయమ్మ నివాళి

హైదరాబాద్‌: డీఏ సోమయాజులు సమోన్నత వ్యక్తిత్వం కలిగిన మేధావి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు.  గత నెల 20 వ తేదీన మరణించిన పార్టీ సలహాదారు డివి సోమయాజులు సంస్మరణ సభలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్ జలవిహార్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె  సోమయాజులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. దివంగత మహానేత వైయస్ ఆర్ తో సోమయాజులుకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 
Back to Top