వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో బెజవాడ బిసి నేతలు

హైదరాబాద్ :

విజయవాడ పశ్చిమ ‌అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్, ‌టిడిపికి చెందిన పలువురు బిసి నాయకులు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నివాసానికి ‌మంగళవారం ఉదయం సుమారు 30 మంది నాయకులు వచ్చి ఆమెను కలుసుకున్నారు. వారందరికీ శ్రీమతి విజయమ్మ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.‌

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పశ్చిమ శాసనసభా నియోజకవర్గం కో ఆర్డినేట‌ర్ జలీ‌ల్ ఖా‌న్ ఆధ్వర్యంలో విజయవాడ ‌నాయకులు హైదరాబాద్ వచ్చి పార్టీలో చేరారు. విజయవాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స్టాండింగ్ కమిటీకి గతంలో చైర్మన్లుగా పనిచేసిన దాడి అప్పారావు‌ (కాంగ్రెస్), జవ్వాది రుద్రయ్య (‌టిడిపి) తమ పార్టీలకు రాజీనామా చేసి వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌లో చేరారు. విజయవాడ బులియన్ మార్కె‌ట్‌లో ప్రముఖ వ్యాపారులైన అరసువల్లి విశ్వేశ్వరరావు, పొత్తూరు సుబ్రమణ్యం, టిడిపి నాయకులు పద్మజ, సూర్యనారాయణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

జగనన్నతోనే బిసిల సంక్షేమం సాధ్యం :
‌అనంతరం జలీల్‌ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని బిసి నాయకులు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని అందుకే వారంతా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎందరో బిసిలు లబ్ధి పొందారని ఆ మేలు వారు మర్చిపోలేరని ఆయన అన్నారు. పార్టీలో చేరిన నాయకులంతా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి కృషిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ‌జలీల్‌ఖాన్ తెలిపారు.

Back to Top