విజయవాడలో నేడు షర్మిల 103వ రోజు పాదయాత్ర

విజయవాడ, 27 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 103వ రోజు బుధవారం రాజరాజేశ్వరీపేట నుంచి ప్రారంభమవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల  రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ తెలిపారు.  రాజరాజేశ్వరీపేట హైస్కూల్, పైపుల రోడ్డు, ప్రకాష్‌నగర్, శాంతినగర్, కృష్ణా హోటల్ సెంటర్ మీదుగా డాబా కొట్లు సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ఏర్పాటవుతుంది. అనంతరం గవర్నమెంట్ ప్రెస్, శివాజీ కేఫ్, బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదగా పాదయాత్ర సాగుతుంది. రాత్రి జింఖానా గ్రౌండ్‌లో శ్రీమతి షర్మిల బసచేస్తారు.

Back to Top