మహాధర్నా ఏర్పాట్లు పరిశీలించిన విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: ప్రభుత్వ పెద్దల భూకుంభకోణాలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈనెల 22న విశాఖపట్నం కలెక్టర్‌ వద్ద మహాధర్నాను నిర్వహించనున్న విషయం తెలిసిందే. మహాధర్నా చేపట్టే ప్రాంతాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తో కలిసి పరిశీలించారు. వేదిక, ధర్నాకు తరలివచ్చే ప్రజలకు చేయాల్సిన వసతులుపై పార్టీ నేతలతో చర్చించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశాఖ ప్రజలకు న్యాయం చేయాలనే ఆవశ్యకతతో మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నాలో పాల్గొని భూకుంభకోణాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విశాఖ ప్రజలు, అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top