వెంకయ్యనాయుడుకు అభినందనలు

న్యూఢిల్లీ: 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యనాయుడికి వైయస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు.  ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని ఉద్దేశిస్తూ శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా మీరు చేసిన ప్రసంగాలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీ పోరాటం అభినందనీయమని ప్రశంసించారు.
 
ఎమ్మెల్యేగా మీరు చూపిన పాత్ర చారిత్రాత్మకమని, అసెంబ్లీ టైగర్‌ గా పిలిచేవారని, మీ రాజకీయ ప్రయాణంలో ఎన్నో గొప్ప పదవులు అలంకరించారని కొనియాడారు. ఉపరాష్ట్రపతిగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వైయస్సార్‌సీసీ అధ్యక్షుడు జగనమోహన్‌ రెడ్డి, పార్టీ తరుపున శుభాకాంక్షలు తెలియజేశారు.
Back to Top