ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వంచన దీక్ష

విశాఖ: విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షను వినిపించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా 2014 ఏప్రిల్‌ 30వ తేదీన నరేంద్రమోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని వంచించారు. హామీని అమలు చేయలేని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ సీపీ వంచన దీక్ష చేపట్టింది. విశాఖపట్నం మహిళా కళాశాలలో జరగబోతున్న దీక్ష ప్రాంగణాన్ని వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు మరోసారి ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారని మండిపడ్డారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడానికి ధర్మ పోరాట దీక్ష అంటూ మరోసారి వంచించేందుకు కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బాబు పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న దీక్షలో రాజీనామా చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారన్నారు. 

తాజా వీడియోలు

Back to Top