గంగుల ప్రతాపరెడ్డి మా పార్టీ కాదు

హైదరాబాద్ః గంగుల ప్రతాపరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు కొన్ని ఛానళ్లు, పత్రికల ద్వారా జరిగిన ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గంగుల ప్రతాపరెడ్డి వైయస్సార్సీపీలో చేరలేదు. ఆయన పార్టీ సభ్యుడు కాదు. పార్టీ నాయకుడు కాదని స్పష్టం చేశారు. గంగుల ప్రతాపరెడ్డి పార్టీ వీడడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో వైయస్సార్సీపీపై  ఎల్లోమీడియా కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే.  ఈనేపథ్యంలో పార్టీ తరపున విజయసాయిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

Back to Top