వైయ‌స్‌ జగన్‌ విశ్వసనీయత కలిగిన నేత

ఢిల్లీ:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మాదిరిగా వైయ‌స్ జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త క‌లిగిన నాయ‌కుల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. 8 ఏళ్లుగా పార్టీని వైయ‌స్ జ‌గ‌న్ ముందుండి న‌డిపించార‌న్నారు. ఎన్ని ఆటుపోట్లు వ‌చ్చినా వెనుదిర‌గ‌లేద‌ని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ.. అనుకున్న లక్ష్యం కోసం వైయ‌స్‌ జగన్‌ దేనికి భయపడకుండా నిరతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వైయ‌స్ జగన్‌ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, పార్టీకి బం‍గారు భవిష్యత్తు ఉంటుందని మేకపాటి రాజామోహన్‌ రెడ్డి అన్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ విలువలు కలిగిన పార్టీ అని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉందని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. 
Back to Top