ప్రత్యేక హోదాపై బాబు ద్వంద్వ వైఖరి

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకసారి హోదా.. మరోసారి ప్యాకేజీ అంటూ చంద్రబాబు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో జరిగిన భేటీలో కూడా టీడీపీ నేతలు ప్యాకేజీ గురించే మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అసలు చంద్రబాబు ప్రత్యేక హోదాను కోరుతున్నారా.. లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. పూటకో మాట.. రోజుకో నిర్ణయం తీసుకుంటూ ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారని ప్రశ్నించారు.
Back to Top