ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

కాకినాడ‌:  దేశ ప్ర‌జ‌లంతా సుభిక్షంగా ఉండాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ సభ్యులు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో తెలుగు రాష్ట్రంలో వినాయ‌క చ‌వితి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.  తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ‌ణేష్ మండ‌పంలో విజయసాయి రెడ్డి,  పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్‌, గుడివాడ అమర్నాథ్‌, వేణుగోపాల్‌ కృష్ణ, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, కోన రఘుపతి, వంతల రాజేశ్వరి త‌దిత‌రులు వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ప్రారంభించారు.  వేద పండితుని మంత్రోచ్ఛరణ నడుమ బొజ్జ గణపయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  

Back to Top